మాకేశ్వరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన పలువురు బిజెపి నాయకులు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా ఆమె వారికి పార్టీ కండువాలు కప్పి బుధవారం మధ్యాహ్నం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మళ్లీ కెసిఆర్ నాయకత్వంలోని పాలనను ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని తెలిపారు.