రైతుల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత తమపై ఉందని జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణ దాస్ అన్నారు. మంగళవారం పోలాకిలోని మబగాంలోని ఆయన గృహంలో పోలీసులు జిల్లా పరిశీలకులు కుంభ రవిబాబుతో పాటు ఆయనను అడ్డుకున్నారు. దీనిపై కృష్ణదాస్ మాట్లాడుతూ.. సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగిందని తాము శాంతియుతంగా జిల్లా అధికారులకు యూరియా సప్లై విన్నవించుకుంటామని తెలియజేశారు.