గ్రామ పంచాయతీలో పనిచేసే కార్మికులందరికీ ప్రభుత్వం దసరా పండుగకు బట్టలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా నాయకుడు నన్నేసాబ్ ఆధ్వర్యంలో బుధవారం వర్ని ఎంపీడీఓ వెంకటేశ్వర్లకు వినతిపత్రం అందజేశారు. పంచాయతీలలో మూడు నెలల బకాయి వేతనాలు ఉన్నాయని, దసరా పండుగ ఎలా జరుపుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి, బకాయి వేతనాలతో పాటు, బట్టలు, సెక్యూరిటీ బూట్లు, గ్లౌజులు, చెప్పులు, నూనెలు, సబ్బులు ఇవ్వాలని నన్నేసాబ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ మండల కార్యదర్శి లింగం, కార్మికులు మారయ్య, సాయవ్వ తదితరులు పాల్గొన్నారు