గుమ్మగట్ట మండలంలోని 75 వీరాపురం గ్రామానికి చెందిన వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు నేత్రపల్లి గ్రామానికి చెందిన లక్మీకి వీరాపురం గ్రామానికి చెందిన లింగప్పతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి సంతానం లేదు. శుక్రవారం మద్యాహ్నం ఇంట్లో లక్ష్మి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హుటాహుటిన రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. పరిస్థితి విషమించి ఆమె మృతి చెందింది. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.