తమ ప్రభుత్వంలో రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు తప్పకుండా కల్పిస్తామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. అమరావతిలోని సచివాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీఐఐసీ ద్వారా ఇష్టానుసారంగా పలు సంస్థలకు భూములు కట్టబెట్టేస్తున్నారని ఇటీవలె సాక్షి పేపర్లో కథనాలు రావడంపై మంత్రి టి.జి భరత్ వివరణ ఇచ్చారు. ప్రభుత్వ నిబంధనలను అనుగుణంగానే పరిశ్రమలు పెట్టే సంస్థలకు భూకేటాయింపులు చేయడం జరుగుతుందన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సీఎం చంద్రబాబు నాయుడు పరుగులు పెట్టిస