సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్ పరిధిలోని పలువురు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు గా అవార్డులను అందుకున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జహీరాబాద్ పట్టణంలోని ఎంపీ యుపిఎస్ లో ఉపాధ్యాయురాలు సిద్దేశ్వరి, మొగుడంపల్లి మండలంలోని పర్వతాపూర్ లో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న ఆనంద్, రంజోల్ ఉపాధ్యాయుడు ఖాజా నిజాముద్దీన్ లను జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి కలెక్టర్ ప్రవీణ్య చేతుల మీదుగా జ్ఞాపిక, సర్టిఫికెట్లను అందజేశారు. ఉత్తమ ఉపాధ్యాయులను డిఇఓ వెంకటేశ్వర్లు, తోటి ఉపాధ్యాయులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.