ఈనెల 15వ తేదీన టిడిపి పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తుల దాడితో గాయపడిన వైఎస్ఆర్సిపి కార్యకర్త ఆదినారాయణ రెడ్డిని కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి పరామర్శించారు. కడప జిల్లా చక్రాయపేట మండలంలోని చిలేకంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని పెద్దూరు గ్రామంలో బుధవారం ఆయన ఇంటికి వెళ్లి ఘటనకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడవద్దని తాము అండగా ఉంటామని ఆదినారాయణ రెడ్డికి ఎంపీ అవినాష్ రెడ్డి ధైర్యం చెప్పారు. శాంతియుతంగానే పోరాడుదామని పేర్కొన్నారు.