శుక్రవారం మధ్యాహ్నం నది అగ్రహారం దగ్గర కృష్ణ నదిలో గణేష్ విగ్రహల నిమజ్జన ప్రదేశంను, పరిశీలించి అక్కడ ఏర్పాటు చేయాల్సిన భద్రత చర్యలను, పోలీస్ బందోబస్తు గురించి గద్వాల సర్కిల్ ఆఫీసర్ శ్రీనుని, గద్వాల్ టౌన్ ఎస్ఐ కళ్యాణ్ ని ఆదేశించడమైంది. క్రేన్స్ ఏర్పాటు చేయాల్సిన స్థలాన్ని పరిశీలించారు, నది ప్రవాహానికి దగ్గరలో భద్రత కోసం, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా బారికేడ్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు తగు సూచనలు చేశారు.నదిలో నిమజ్జనం సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా గజ ఈతగాళ్లను ఏర్పాటు చేసి పర్యవేక్షించాలి అని ఎస్పీ తెలిపారు.