రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, వికలాంగులు, వితంతు మహిళలు, దీర్ఘకాలిక రోగులకు అండగా నిలిచిందని రాష్ట్ర గిరిజనాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని 3వ వార్డు పరిధిలో ఉన్న గుమడాంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పెన్షన్ లబ్ధిదారుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దేశంలోని మరి ఏ ఇతర రాష్ట్రంలోనూ ఇవ్వనంతగా అధిక మొత్తంలో ఆర్థిక సాయాన్ని మన రాష్ట్రంలో సామాజిక పెన్షన్లుగా అందిస్తున్నామన్నారు.