రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ జే ఏ సి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. నల్ల చొక్కాలు ధరించి, నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు. ప్లకార్డులు పట్టుకుని ఒ పి ఎస్ విధానం అమలు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ జే ఏ సి నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని అన్నారు. పెండింగ్ లు 5 డి ఏ లు విడుదల చేయాలని కోరారు. దేశంలో 5 డి ఏ లు పెండింగ్లో ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని అన్నారు.