ప్రొద్దుటూరు పాత మార్కెట్ ఆంజనేయ స్వామి దేవాలయం పక్కన వున్న పోతురాజు స్వామి గుడి వద్ద పార్కింగ్ సమస్య లేకుండా చూడాలని ప్రొద్దుటూరు శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక వారు కోరారు. శనివారం మధ్యాహ్నం వారు ఈ విషయమై స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ చింతా రవిచంద్రారెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనంతరం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పాత మార్కెట్ లో వున్న పోతురాజు స్వామి దేవాలయం చుట్టు పక్కల పూర్తిగా అన్యాక్రాంతమై దేవాలయంలో పూజలు చేసుకొనుటకు కూడా అవకాశం లేకుండా భక్తులకు ఇబ్బందిగా వున్నదని, ఆ ప్రాంతంలో మోటార్ సైకిల్ లు పార్కింగ్ చేసి అక్కడ దేవాలయం కూడా అగుపించని స్థితిలో