చౌడేపల్లి మండలంలో గురువారం ఒక దుర్ఘటన చోటుచేసుకుంది. ఎస్సై నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం, మండలంలోని కొండామర్రి గ్రామానికి చెందిన అనుప్రియ స్కూటీపై పనుల నిమిత్తం చౌడేపల్లి వెళ్తుండగా చిన్నకుంట వద్ద కుక్క ఒక్కసారిగా ఎదురుపడింది. వాహనాన్ని నిలువరించే ప్రయత్నంలో అదుపు తప్పి రోడ్డుపై పడిపోవడంతో ఆమెకు తలకు తీవ్ర గాయాలయ్యాయి.