మంత్రాలయం: మండల కేంద్రంలోని శ్రీ రెసిడెన్సీ లాడ్జిలో పనిచేస్తున్న కర్ణాటక రాష్ట్రం శివమొగ్గకు చెందిన రవి అనే కార్మికుడు బాత్రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై లాడ్జి యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మంత్రాలయం ఎస్ఐ శివాంజల్ శుక్రవారం తెలిపారు. ఈ సంఘటన సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.