రైతుల హక్కుల కోసం, వారికి జరుగుతున్న అన్యాయంపై ఈనెల న జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ అధికారులకు వినతిపత్రాలు ఇవ్వనున్నట్లు నంద్యాల జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. బుధవారం కల్లూరులోని వైఎస్సార్సీపీ కార్యలయంలో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యం రైతుల పాలిట శాపంలా మారిందని, పంటలకు కావలసినటువంటి యూరియాను సరఫరా చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు.