దేవనకొండ మండల కేంద్రంలో ప్రపంచ పత్తి దినోత్సవాన్ని పురస్కరించుకుని JDA వరలక్ష్మి, KVK సైంటిస్ట్ రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతుల శిక్షణ నిర్వహించారు. పత్తి సాగులో ఆధునిక పద్ధతులు, విత్తన ఎంపిక, పురుగుమందుల సరైన వినియోగం వంటి అంశాలను వారికి వివరించారు. కార్యక్రమంలో ఏవో ఉషారాణి, సైంటిస్టులు, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.