కరీంనగర్ ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం కురుస్తుంది. అయిన వర్షాన్ని సైతం లెక్క చేయకుండ వినాయక మండపాలకు విగ్రహాలను తరలిస్తున్న జనం. బుధవారం ఉదయం నుంచి కరీంనగర్ నగరంలో ఆకాశం మేఘావృతమై వర్షం ప్రారంభమైంది. వర్షం కారణంగా వాతావరణం చల్లబడింది. నగరంలోని టవర్ సర్కిల్, విద్యానగర్, కోర్టు ఏరియా, కోతిరాంపూర్, రాంనగర్ తదితర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షానికి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు నగరం లో ఈదురు గాలులకు చెట్టు నెలకొరిగాయి. మరోవైపు వర్షంలో కూడా నిర్వాహకులు గణపతులను మండపాలకు తరలిస్తున్నారు.