చిట్వేల్ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశం మరియు మండల మీటింగ్ లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు మరియు యువ నేత ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు — “మూడు నెలల్లో పనితీరు చూపించండి” అని అధికారులకు కఠిన హెచ్చరిక జారీ చేశారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేశారు. “గ్రామ అభివృద్ధి రాష్ట్రాభివృద్ధికి పునాది” అన్నారు. విద్యుత్, మంచినీటి సరఫరా, విద్యా రంగ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. “అన్నదాత సుఖీభవ” పథకం రైతులకు మేలుచేస్తోందని పేర్కొన్నారు.