రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలోని దేవాలయాల్లో భక్తుల సౌకర్యాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు పేర్కొన్నారు. శనివారం నగరంలోని పెదవాల్తేరు లాసన్స్ బే కాలని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి చోడె వెంకట పట్టాభిరామ్ తో కలసి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తమ కూటమి ప్రభుత్వం దేవాలయాల్లో భక్తుల సదుపాయాలు మెరుగు పరిచేందుకు కృషి చేస్తుందన్నారు.