వాంకిడి మండలంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపికలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని BJYM రాష్ట్ర అధికార ప్రతినిధి సుచిత్ డిమాండ్ చేశారు. గురువారం వాంకిడి MPDO కార్యాలయం వద్ద పార్టీ నాయకులతో కలిసి మాట్లాడారు.. అర్హులైన లబ్దిదారులను పక్కనా పెట్టి, అనార్హులై కాంగ్రెస్ నాయకులకే ఇండ్లను మంజూరు చేశారని ఆరోపించారు. అధికారులు విచారణ జరిపి..అనార్హులై వారి పేర్లను తొలగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో లబ్దిదారులతో కలిసి సోమవారం నుండి ఎంపీడీవో కార్యాలయం ఎదుట లబ్దిదారులతో నిరవధిక నిరహార దీక్ష చేస్తామని హెచ్చరించారు.