శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఓం నమఃశివాయ అంటూ భక్తుల నామస్మరణతో దేవస్థానం మార్మోగింది. తాడిపత్రిలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి క్షేత్రంలో మాస శివరాత్రి పురస్కరించుకొని ప్రాకారోత్సవం కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా నిర్వహించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, సతీసమేతంగా హాజరై పల్లకి ఉత్సవంలో పాల్గొన్నారు. పెద్దఎత్తున భక్తులు స్వామివారి పల్లకి మోసేందుకు ఆసక్తి చూపారు.