నిర్మల్ జిల్లా కేంద్రంలోని నట్ రాజ్ ఫీడర్ లో ఉన్న విద్యుత్ స్తంభాలు మార్చేందుకు సోమవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని డిఈ నాగరాజు ఆదివారం తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు బహుబలి టవర్, భాగ్యనగర్, మదీనకాలని, ఇంద్రనగర్, శాస్త్రీనగర్, గొల్లపేట్ ఏరియాలో విద్యుత్ ఉండదని పేర్కొన్నారు ఆయా కాలనీలకు చెందిన వినియోదారులు సహకరించాలని కోరారు.