శేర్లింగంపల్లి డివిజన్లోని పలు గణేష్ మండపాలను ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి శనివారం మధ్యాహ్నం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తీర్థప్రసాదాలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ సిద్ధి బుద్ధి జ్ఞానం ప్రసాదించే గణేశుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. గణేశుడిని నియమ నిష్ఠలతో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు.