చిత్తూరు జిల్లా కుప్పంకు కృష్ణా జలాలను తీసుకొచ్చిన ఈరోజే తన జీవితంలో ఎంతో పవిత్రమైన రోజు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జలహారతిలో భాగంగా శనివారం ఆయన బహిరంగ సభలో మాట్లాడారు 8 ఎన్నికల్లో మీ ఇంటి బిడ్డగా గెలిపించారు ఆ అభిమానాన్ని నిలబెట్టుకోవడానికి నిత్యం నేను కృషి చేస్తూనే ఉంటానని దాదాపు 730 కిలోమీటర్ల నుంచి కృష్ణా జలాలను కుప్పంకు తెచ్చామని అన్నారు దీనికోసం 27 లిఫ్టు ఇరిగేషన్లు ఎన్నో సొరంగాలను తవ్వామని దీంతో కుప్పానికి రెండేళ్ల ముందే కృష్ణ పుష్కరాలు వచ్చినట్లు ఉందని సీఎం తెలిపారు.