ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు అస్లాం, వయసు 48 సంవత్సరాలు, బారా ఇమామ్ పంజా సెంటర్లో నివాసం ఉంటూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నట్లు లాలాపేట సీఐ శివప్రసాద్ బుధవారం రాత్రి ఒక ప్రకటన ద్వారా తెలిపారు. గత కొంత కాలం క్రితం కుటుంబ అవసరాల నిమిత్తం డబ్బులు అవసరమై అప్పులు చేశాడని, అప్పులు తీర్చలేక బాధపడుతూ ఉండేవాడని చెప్పారు. గత రాత్రి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లిపోయాడని తిరిగి ఇంటికి రాలేదన్నారు. అదృశ్యమైన ఆటో డ్రైవర్ అస్లాం కుమారుడు షేక్ అనాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.