సూర్యాపేట జిల్లా కోదాడ శ్రీమన్నారాయణ కాలనీలోని 21వ వార్డులోని ఇంట్లో దొంగతనం జరిగింది. ఈ సందర్భంగా స్థానికులు తెలిపిన వివరణ ప్రకారం 12 తులాల బంగారంతో పాటు రెండు లక్షల నగదు దోచుకెళ్లినట్లు సమాచారం. ఆదివారం తెలిసిన వివరాల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. దీంతో క్లూస్ టీం రంగంలోకి దిగింది పరిసర ప్రాంతాలు వేలిముద్ర నమూనాలను సేకరిస్తున్నారు.