ఆదిలాబాద్ విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట విద్యుత్ కాంట్రాక్టర్ల నిరసన వ్యక్తం చేశారు. పూర్తి చేసిన పనులకు పెండింగ్ బిల్లులు చెల్లించలని ఆదివారం నల్ల రిబ్బన్ లను ధరించి నిరసన తెలిపారు. బిల్లులు చెల్లించకుండా ఓ అధికారి వేధిస్తున్నారని వారు ఆరోపించారు. సదరు అధికారిపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బిల్లులు చెల్లించే వరకు విద్యుత్తు పనులను నిలిపివేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. అధికారి తమపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు