రాంనగర్లోని తరనివాసంలో అలై బలై ఫౌండేషన్ చైర్ పర్సన్ విజయలక్ష్మి మీడియాతో మంగళవారం మధ్యాహ్నం మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అక్టోబర్ మూడవ తేదీన నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అలైబలై కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుక 20వ సంవత్సరానికి అడుగుపెడుతూ తెలంగాణ సంప్రదాయాలు కలలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాల సీఎంలు గవర్నర్లు హర్యానా సీఎంతో సహా పలువురు హాజరవుతారని సందర్భంగా ఆమె తెలిపారు.