ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ శశాంక్ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో రాజేంద్రనగర్ రిటర్నింగ్ ఆఫీసులో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంట్ పరిధి 7 నియోజకవర్గాలలో 29,28,286 ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు.