రైతు భరోసా కేంద్రాన్ని తనిఖీ చేసిన అధికారులు ఆళ్లగడ్డ మండలం ఓబులంపల్లి గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని మంగళవారం మండల తహశీల్దార్ జ్యోతి రత్నకుమారి, వ్యవసాయాధికారి కిషోర్ కుమార్ రెడ్డితో కలిసి తనిఖీ నిర్వహించారు. అనంతరం తహశీల్దార్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఓబులంపల్లి గ్రామంలో రైతు భరోసా కేంద్రానికి పది టన్నుల యూరియా వచ్చిందని రైతులందరూ తీసుకొని వెళ్లినట్లు స్టాక్ రిజిస్టర్లో తేలిందన్నారు.