కొరిసపాడు గ్రామంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వస్తున్న ఫోర్ వీలర్ ఆటో ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తి వెంకటేశ్వర్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు అతని వెంటనే ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.