బీసీ హక్కుల కోసం నిరసన దీక్షను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మ్యాకల పరిశరాములు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మ్యాకల పరిశరాములు మాట్లాడుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు కలెక్టరేట్ వద్ద నిరసన దీక్ష చేపట్టడం జరిగిందని బీసీలకు విద్యా ఉద్యోగాలు రాజకీయంగా చట్ట సభలలో రిజర్వేషన్ లు కల్పించాలని డిమాండ్ చేశారు.