విద్యా–వైద్య దోపిడిని చట్టాల ద్వారానే నియంత్రించాలని ఏఐఎఫ్‌డిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పల్లె మురళి అన్నారు. అమరజీవి కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ శతజయంతి వార్షికోత్సవం సందర్భంగా నారాయణఖేడ్‌లో నిర్వహించిన జిల్లా సదస్సులో మాట్లాడుతూ, విద్య–వైద్యం సామాన్యులకు అందుబాటులో లేకుండా కార్పొరేట్ వర్గాలకు అప్పగించారని విమర్శించారు. విద్యలో ఉన్నట్లే వైద్యరంగానికీ కంట్రోల్ బోర్డు ఏర్పాటు చేయాలని, ఒకే విధమైన ఫీజు విధానం అవసరమని సూచించారు. విద్యా–వైద్య దోపిడి నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి టి.కుమార్, నాయకులు శ్రీకాంత్ పాల్గొన్నారు.