కళ్యాణదుర్గం మండలం నారాయణపురం రైల్వే గేట్ సమీపంలో ప్రమాదవశాత్తు రైలు కిందపడి 15 గొర్రెల మృతి చెందాయి. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. గొర్రెల మంద రైల్వే ట్రాక్ దాటుతున్న సమయంలో రైలు వేగంగా వచ్చి ఢీ కొనింది. ప్రమాదంలో 15 గొర్రెలు అక్కడకక్కడే మృతి చెందాయి. భారీగా నష్టం వాటిలినట్లు గొర్రెల కాపరులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన పై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.