వినాయక ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని శంకరంపేటలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎసై నారాయణ గౌడ్ ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయ గ్రామాల శాంతి కమిటీ సభ్యులు మరియు గణేష్ విగ్రహ నిర్వాహకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎసై నారాయణ మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో శాంతి యుతంగా సామరస్యంగా పండుగ వేడుకలు నిర్వహించాలని సూచించారు. తప్పనిసరిగా పరిమిషన్ తీసుకోవాలని, రోడ్డుకు అడ్డంగా మండపలు ఏర్పాటు చేయొద్దని, గొడవలు కాకుండా చూసుకోవాలని, ఏమైన ఇబ్బద్దులు ఉంటె తమకు సమాచారం ఇవ్వాలని, డీజే వాడకాన్ని పూర్తిగా నిషేదేం అన్నారు.