కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పరిధిలోని కలసపాడు మండలం కలసపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం వైద్యాధికారులు 'ఆశా డే ' కార్యక్రమము నిర్వహించారు. ఈ కార్యక్రమం లో వైద్యాధికారి డాక్టర్ శైలజ, బద్వేల్ సబ్ యూనిట్ ఆఫీసర్ నరసింహారెడ్డిలు హాజరై, ఆశా కార్యకర్తలకు, ఎఎన్యం,' యంఎల్యచ్పి లకు జాతీయ కీటక జనిత వ్యాధులపై, అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా వైద్యాధికారి డాక్టర్, శైలజ ఆశా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ' ప్రతి శుక్రవారం,'ఫ్రైడే డ్రైడే ''కార్యక్రమాన్ని, ప్రజలకు అవగాహన కల్పించి, లార్వాలను అదుపు చేసినప్పుడే, దోమలను నియంత్రణ చేయగలుగుతామని వైద్య సిబ్బందికి తెలిపారు.