తెలంగాణ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మల్లారెడ్డి మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తన పుట్టినరోజు స్వామి వారిని దర్శించుకుంటానని తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ సీఎం కావాలని ఆ దేవునికి మొక్కుకున్నట్లు చెప్పారు ఏపీలో సీఎం చంద్రబాబు మోడీ ప్రభుత్వంతో కలిసి పేద ప్రజలకు పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు.