చిత్తూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి బావిలో పడి చనిపోయిన ఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే చిత్తూరు తేనె బండ హరిజనవాడకు చెందిన సతీష్ అదే ప్రాంతంలో నివాసముంటున్న సారిక ఇద్దరు ఆరు సంవత్సరాలుగా వివాహేతర సంబంధంలో ఉన్నారని సారిక ఇటీవల అతన్ని వివాహం చేసుకోవడానికి నిరాకరించడంతో మృతుడు సతీష్ మానసిక క్షోభకు గురై బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మృతుడి అన్న బుజ్జి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.