మంత్రాలయం : శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామీజీ ఆధ్వర్యంలో చంద్రగ్రహణం శాంతి కోసం ప్రత్యేక పూజలు, హోమాలు చేశారు. సోమవారం పీఠాధిపతి తమ శిష్య బృందంతో కలిసి తుంగభద్ర నదిలో దండోదక పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం శ్రీ మఠానికి చేరుకునీ వారుబృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులు ఇచ్చారు. గ్రహణం సందర్భంగా భజనలు, శ్లోకాలు, జపాలు పఠించారు.