కర్నూలు తాలూకా పీఎస్ పరిధిలో ఉన్న బాలాజీ నగర్ లో చైన్స్ నేచర్ మూడున్నర తులాల బంగారు గొలుసు దొంగలించి వెళ్లిన ఘటన చోటుచేసుకుంది. గురువారం మధ్యాహ్నం 1 గంట సమయంలో బాలాజీ నగర్ కు చెందిన మంజుల అనే వివాహిత ఇంట్లో ఉండగా చైన్స్ నేచర్ సారు ఉన్నారా అంటూ అడుగుతూ ఇంట్లోకి వచ్చి ఆమె మెడిలో ఉన్న గొలుసును దొంగలించి ఆమెను స్టోర్ రూమ్ లో బంధించి వెళ్లారు. భర్త రామాంజనేయులు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇంటికి వచ్చేసరికి భార్య మంజుల షోరూంలో బందీగా ఉండడంతో ఘటనను వివరించింది. దీంతో కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు