తిరుపతి జిల్లా వాకాడు మండలంలో గణేష్ నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది..కాశిపురం నుండి తూపిలిపాలెం సముద్రం వద్దకు వినాయక నిమజ్జనం కోసం వెళుతుండగా వాకాడు బిసి కాలనీ వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది...ఈ ప్రమాదంలో 10 మంది యువకులకు గాయాలు కాగా మరి కొంతమందికి స్వల్ప గాయాలు అయ్యాయి...గాయపడినవారిని వాకాడు ఏరియా ఆసుపత్రికి తరలించారు...ప్రమాద సమయంలో ట్రాక్టర్ లో 30 మంది వరకు ఉన్నట్లు సమాచారం...