రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని కోరుతూ ఎన్ఆర్ఐ లు గురువారం ఓ వీడియో విడుదల చేశారు. నియోజక వర్గానికి వైద్యం, విద్య, ఉద్యోగ అవకాశాల పరంగా కాకినాడ చాలా సౌకర్యవంతంగా ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ డిమాండ్ కోసం పోరాడుతున్న జేఏసీ కన్వీనర్ అమ్మిరాజు, కో-కన్వీనర్ సిద్దులకు మద్దతుగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.