హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ లో జరిగిన అఖిలభారత మేయర్ల సదస్సులో అనంతపురం నగర మేయర్ మొహమ్మద్ వసీం సలీం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యల గురించి ప్రధానంగా చర్చించారు. నగరంలో నీటి వసతి మరుగుదొడ్లు కాలువల నిర్మాణం తదితర అంశాలను వారు వివరించారు. అనంతపురం నగర మేయర్ కు అఖిలభారత మేయర్ల సదస్సులో అవకాశం దొరకడంపై హర్షం వ్యక్తం చేశారు.