వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈనెల 9న నంద్యాల ఆర్డీవో కార్యాలయం ముందు ఎరువుల బ్లాక్ మార్కెట్ తరలింపు పై అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ ఇషాక్ బాషా తెలిపారు. ఆదివారం వైసీపీ కార్యాలయంలో నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను మాజీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నీస తదితరులతో కలిసి ఆవిష్కరించారు ఈ కార్యక్రమం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుండి ప్రారంభమై ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీగా కొనసాగుతుందని అనంతరం ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించడం జరుగుతుందని ఎమ్మెల్సీ తెలిపారు ఈ కార్యక్రమంలో రైతులు భారీ సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు