పార్వతీపురం మన్యం జిల్లా, కోమరాడ మండలం, రాజలక్ష్మిపురం గ్రామంలో జడ్పీ పాఠశాల విద్యార్థులకు శక్తి టీం సభ్యులు సైబర్ క్రైమ్ పై శుక్రవారం అవగాహన కల్పించారు. శక్తి టీం సభ్యులు ఎల్. శ్రీనివాసరావు, నిర్మల తదితరులు విద్యార్థులకు ఫోక్సో యాక్ట్, ఈవ్ టీజింగ్, గుడ్ టచ్, బాడ్ టచ్, శక్తి యాప్ తదితర వాటిపై అవగాహన కల్పించారు. అవసరమైన సమయాల్లో శక్తి యాప్ ను వినియోగించాలన్నారు.