యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి చిట్యాల రహదారిపై ప్రమాదవశాత్తు లారీ బోల్తా పడింది .ఈ సందర్భంగా శనివారం తెలిసిన వివరాల ప్రకారం భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి సమీపాన జరిగిన ఈ ఘటనలో ఎలాంటి ప్రాణా నష్టం జరగలేదు క్రేన్ సహాయంతో లారీని బయటికి తీశారు. ఈ రహదారిపై లారీలు అతివేగంగా ప్రయాణిస్తున్నాయని పలువురు స్థానికులు ఆరోపించారు .ప్రమాదానికి లారీ లు వేగంగా వెళ్లడమే కారణం అవుతున్నాయని తెలిపారు.