ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ నందు ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐ వి సుబ్బారావు ఆధ్వర్యంలో జిల్లాలోని విలేకరులకు శిక్షణ తరగతుల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, ఎర్రగొండపాలెం టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో విలేకరుల పాత్ర అత్యంత ప్రాముఖ్యమైనదని ఎప్పటికప్పుడు నిరంతర విద్యార్థిగా ఉంటూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరారు.