అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం ఓబిలి గ్రామానికి చెందిన కొడూరు నీరజకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.1,25,373 చెక్కును ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ప్రజల కష్టసమయంలో ప్రభుత్వం అండగా ఉండటం కూటమి ప్రభుత్వ లక్ష్యం” అని పేర్కొన్నారు. ముక్కా సాయి వికాస్ రెడ్డి మాట్లాడుతూ, “సీఎం రిలీఫ్ ఫండ్ ప్రజల ఆరోగ్య భద్రతకు, ఆర్థిక బలానికి దోహదం చేస్తోంది” అన్నారు. ఈ కార్యక్రమంలో NDA కూటమి నేతలు పాల్గొన్నారు.