ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటు హక్కు పొందేలా చర్యలు తీసుకోవాలని కర్నూలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్ సూచించారు. గురువారం నగరపాలక కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… ఓటరు జాబితా సవరణలో భాగంగా ఫారం 6, 7, 8లను వినియోగించుకోవాలని, ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రజలకు మార్గనిర్దేశం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెలా రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించి, సలహాలు, సూచనలు, ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.అలాగే త్వరితగతిన బూత్ ఏజెంట్ల జాబితాను