ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం లో జిల్లా ఆత్మ వారి సౌజన్యంతో పులిపాడు బసవపురం పసుపుగల్లు గ్రామాల్లో రైతులు సాగు చేస్తున్న మొక్కజొన్న వరి పొలాలను పరిశీలించారు. మొక్కజొన్న మరియు వరి పొలాలలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని వ్యవసాయ పరిశోధన ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సంధ్యారాణి, డాక్టర్ వరప్రసాదరావు రైతులకు సూచించారు. వరి పొలాల పరిశీలించిన శాస్త్రవేత్తలు ఆకు ముడత ఆశించే ప్రమాదం ఉందని ఆకు ముడత నివారణకు తీసుకోవాల్సిన తగు జాగ్రత్త చర్యలు తెలియజేశారు. మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు ఆశించిందని కత్తెర పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే పంటకు నష్టం వాటిల్లుతుందని రైతులకు సూచించారు.