ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలో రాగి తీగల దొంగలు రెచ్చిపోతున్నారు. దాదాపు 40 మంది రైతులకు చెందిన రూ.2 లక్షలు విలువచేసే వ్యవసాయ మోటార్లలోని రాగి తీగను దొంగలు చోరీకి పాల్పడ్డారు. పొలానికి నీరు కట్టేందుకు ఉపయోగించే మోటార్లలో దొంగలు చోరీకి పాల్పడినట్లుగా బాధిత రైతులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు జరిగిన ఘటనపై విచారణ చేపట్టారు. అంతేకాకుండా వ్యవసాయ మోటార్లకు ఉపయోగించే కండక్టర్ వైర్లు కూడా దొంగలు కాల్చి తీసుకువెళ్లినట్లుగా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.